ఈ ఆత్మగీతాలు అని సున్నితంగ మనస్సును తట్టిలేపినట్లు ఉంటాయి

ఈ కవితా సంపుటి లోనిఆత్మగీతాల గురించి చెప్పే ముందు నరేష్కుమార్ సూఫీ అన్న గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలి..

సూఫీ అనే పదం వింటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నరేష్ బ్రోనే..

మేము ఫేస్బుక్కు ద్వారా చాలా కాలం గా తెలిసున్నా వ్యక్తిగతంగా ఏ మాత్రం పరిచయం లేదు ఇన్స్టాగ్రాంలో రీల్స్ అలా అలా షేర్ చేసుకుంటూనే కాస్త కాస్త పరిచయం పెంచుకున్నా. ఎందుకనో ఒకరోజు అలా ఫొన నుంబెర్ అడగ్గానే ఇచ్చేసాడు వెంటనే కాల్ చేసి బోలెడు కబుర్లాడుకున్నాం .. కొన్ని పుస్థకాల పి డి యఫ్ లను పంపించంది అవి చదివి ఆయనకి పెద్ద ఫాన్ ఐపొయా.. తర్వాత జమీల్యా గురించి చెప్పాడు .. వెంటనే ఆ పుస్తకం కూడా చదివేసా అనువాద రచనలు పెద్దగా ఆకుట్టుకోలేవనే నా భ్రమనుండి ఆ నవల నన్ను బయటపడేసింది.

ఏ మాత్రం అనువాద నవల అని అనిపించకుండా చాలా చక్కగా భావొద్వేగాలను ఆయన రచించిన విధానం పదాల అమరిక చాల బాగా అనిపించింది..

ఇహ ఇప్పుడు ఆయన కవితా సంపుటి అనామకుని ఆత్మగీతం ఈ రచన గురించి ఎంతచెప్పినా తక్కువే. పుస్తకం రాగానే ఒక్కోకవిత చదువుతుంటే మనసులోనుండి ఎన్నో ప్రశ్నలకు జవాబులు, ఎన్నో ఆందోళనల నుండి విముక్తికలిగిన మిశ్రమ భావాలు లోలోపల.. ఇంకేమాత్రం ఆగలేక పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడినా అసలెట్లా రాసినారు ఈ కవితలు ఇంత ప్రనం పోసుకున్నయి కళ్ళముందర జీవితాన్ని చూపిస్తున్నాయి .. ఒక్కో కవిత ఒక్కో ఆణిముత్యంలా జీవితానుభవ సంగ్రహంలా కనిపిస్తున్నది..

శీర్షికలకు తగ్గ కవితలను ఇంత పొందిగ్గా రాసిన కవులు అరుదు.కవితా వస్తువును ఎంచుకున్నట్లుగా కాక అందులో జీవించినట్లుగా రాసిన ఆయన శైలి పాఠకుడికి సూటిగా గుచ్చుకుంటుంది.

పుస్తకం పేరు ను ఆయన ఎంచుకున్న విధానం ఎటువంటిదో గానీ అసలు ఇంతవరకు అనామకుడు అన్న పదానికున్న అర్థాన్ని పూర్తిగా మార్చేశారు అనే అనిపిస్తుంది.. అసలు అనామకుడు అని ఎవర్ని అంటారు? నాకు తెలిసి ఎవ్వరూ లేని వారిని అనామకుడు అంటారు ఇందులోని కవితలను చదివి తే తనలోతాను అంతర్లీనమైపోయినవాడు అనామకుడు అని సరి కొత్త అర్థాన్ని ఇచ్చారు సూఫీ….

కొన్ని ఆత్మగీతాల్ని అలా పలకరిద్దాం

ఇట్లా ఒకచోట:

చెప్పలేను గానీ.. పారిపోవాలనే ఉంతుంది..ఎక్కడికైనా అంటూ..

సముద్రతీరాలకవతలినుంచి ఓ పిలుపు దుఖపు జీర స్వరంతో నా గొంతుతో నన్న పిలుస్తారెవరో..నా నుంచి విముక్తిమ్మంటారెవరో అంటూ మనస్సులో దాగి ఉన్న ఓ సంక్షోభాన్ని గురించి న వాక్యాలు నిస్చేష్టుల్ని చేస్తాయి..

మరో కవితలో.. నుదిటి మీద ఓ మంచు చల్లని స్పర్శ/ గుండెలపై వెచ్చని చెయ్యి/ కదులుతున్న కళ్ళలో మత్తుగొలిపే నిదుర/ అచేతనంగా ఉన్న నన్ను ఎవరో శవపేటికలో ఉంచి మోసుకుపోతుంటారు/ నేను హాయిగా నిదురిస్తుంటాను..అంటాడు ..మృత్యువుని సైతం ఆనందంగా ఆస్వాదిస్తాను అని ఎంత హాయిగా చెబుతున్నడో కవి..

ఇంగ్లీషులో కూడా టైటిల్స్ ఉన్నాయి కొన్ని కవితలకు అందులో కొన్నిటిని ఇక్కడ ప్రస్థావిస్తాను..breezy dream లో నిదురా మెలకువా తెలియని స్థితిలో కనులు తెరవాలని ప్రయత్నిస్తూ..కొట్టుకులాడుతూ శ్వాసిస్తావు నువ్వు..

చల్లని గాలి వీస్తూనే ఉంటుందిఎప్పుడూ..అంటాడు..

disturbed night శిక్షించబడ్డానీ రాత్రి

ఒంటరిగా ఉన్నందుకు, ఇంకా …అంటూ మొదలుపెట్టి ఇరానీ వాసనల చార్మినార్ చంద్రుణ్ణి మోసే నీడ,

నగరం రెక్కలేని పావురాల కబుతర్ ఖాన,

నెమలీకల గోరీ మీద వాలి న సీతాకొకలా నేనూ..

ఎమన్నా కవితక్షరాలా ఇవి .. మన సుని తేలిక పరిచేలా మళ్ళీ మళ్ళీ ఆ కవితా ఝరుల్ని మెదడు ఆస్వాదించేలా రాయగలగటం చాలా గొప్ప విషయం.. ఎంతో అనుభవం పరిణతి ఉన్న కవితలు ఇవి..

ఇలా ఒక్కో కవితకు ఒక్కో ప్రత్యేకత ఉంది ఓ ప్రేమ, ఓ విముక్తి, ఓ విరక్తి, ఓ యుద్ధ సంక్షోభం, ప్రేమ – ఆవేదనల ప్రకంపనలు, జనన మరణాల మధ్య తారతమ్యత.. .

ఓ కవిత let me say something లో ఇలా అంటాడు ఎంతదూరం పోయినా ఎల్లిపాయంత దూరం మిగిలే ఉంతుంది nothing is impossible అనునదో భ్రమ/నీ జీవితం ఒక బ్లాక్ హోల్ తెలిసింది తెలియందీ అంతా ఉత్తదే you know ! దూరాలు దగ్గరలూ ఎక్కడా ఉండవు లేదంటే .. కనిపిస్తాడా ఒకే చంద్రుడు రెండుచోట్లా ఒకేలాగా అందుకే నలుగు మాటలు చెప్పేసుకోవాలి..👏👏

I breath I protest అన్నా war in you రోజూ.. life in traffic లో song of a dead violin గా అద్భుతాల్ని కళ్ళముందుకు తీసుకొస్తాయి ఈ కవితలు..

ఏదో ఒక రోజు జీవిత చక్రం ఆగిపోవాల్సిందే అలా కాకుండా మధ్యలోజీవితం ముగిసిపోయిందని ప్రశ్నార్థక పరిస్థితి లో ఉంటే వారికి ఈ పుస్తక అన్ని బహుమతిగా ఇచ్చి వారిని కాపాడిన వాళ్ళం అవ్వచ్చు..ఎంతో తేలికగా నీ కథా నా కథా ఏదో ఒక చోట ఖచ్చితంగా కలుస్తాయి..కలిసిన వేళ నేనెంత వేదన పడ్డానో కాలచక్రంలో నువ్వు అంత వేదన పడచ్చూ ,పడకపోవచ్చూ కొన్ని చోట్ల మౌనంగా ఉండనూ వచ్చు, మరి కొన్ని నువ్వు మధ్యలో ఆపేసి నీ కథని ముగించినా నీ ఆత్మఘోషనే నా ఈ కవితలు ఈ ఆత్మగీతాలు అని సున్నితంగ మనస్సును తట్టిలేపినట్లు ఉంటాయి ఒక్కో కవితలో ని భావాలు.

Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart