కులం పుట్టుక -నిర్మూలన

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కులం(పుట్టుక -నిర్మూలన) అనే ఈ పుస్తకం వెనకబడిన కులాల ప్రజల కోసం రాసింది కాదు. ఏ చట్టాలు, పథకాలు తీసుకొస్తే దళితులు బాగుపడతారో ఇందులో చర్చించలేదు. ఇది భారతీయులందరి బాగుకోసం రాసింది. ముఖ్యంగా కులవ్యవస్థ వల్ల నష్టపోయిన హిందువుల బాగుకోసం రాసిన పుస్తకం. హిందూమతంలో చేరిన కులం అనే మురికిని నిర్మూలించుకోవడం ఎంత అత్యవసరమో వివరించిన పుస్తకం. కులం వలన భారత జాతి ఎంత బలహీనమైపోయిందో కళ్ళకు కట్టినట్టు చూపిన పుస్తకం.

ఈ పుస్తకాన్నిఎవరు చదవాలి? చదివితే ఎవరికి ప్రయోజనం?

ఒక ఉదాహరణతో ఈ ప్రశ్నను అర్దం చేసుకుందాం. “స్థూలకాయం (అధిక బరువు లేదా obesity) తగ్గించుకోవడానికి మన జీవనశైలిలో ఏ మార్పులు చేసుకోవాలి?” అనే సైంటిఫిక్ రీసెర్చ్ పుస్తకాన్ని చదివితే ఎవరు ప్రయోజనం పొందుతారు? స్థూలకాయాన్ని సమస్యగా గుర్తించినవారు మాత్రమే ప్రయోజనం పొందుతారా? లేక సమస్యగా గుర్తించకపోయినా, స్థూలకాయం ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రయోజనం పొందుతారా? స్థూలకాయాన్ని సమస్యగా గుర్తించకపోయినా దాని వలన డయాబెటీస్, గుండె జబ్బులు, జాయింట్ నొప్పులు, ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సైంటిఫిక్ రీసెర్చ్ చెబుతుంది. కాబట్టి ఆ పుస్తకం చదివితే అప్పటి వరకూ స్థూలకాయాన్ని ఒక ప్రబ్లెమ్ గా చూడనివారు కూడా, నిజానిజాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్తపడి, ఆరోగ్యాని మెరుగుపరచుకొనే అవకాశం ఉంటుంది. ఇదే సూత్రం కులం (పుట్టుక మరియు నిర్మూలన) అనే పుస్తకం విషయంలో కూడా వర్తిస్తుంది. ఇది కులం యొక్క అన్ని కోణాలను సైంటిఫిక్ గా పరిశోధించి రాసిన పుస్తకం. “నేను వెనుకబడిన కులంలో పుట్టలేదు. కులవివక్ష ఎదుర్కోలేదు. కాబట్టి కులం అనేది నాకు సమస్య కాదు” అనే అపోహలో చాలామంది ఉంటారు. కులవివక్ష అనేది కులవ్యవస్థలోని ఒకానొక సమస్య మాత్రమే. వివక్ష ఎదుర్కొనక పోయినా కులవ్యవస్థ కారణంగా అన్ని కులాల్లోని ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం, ఇక్కడి సమాజం లోని నైతిక విలువలు, దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా బలహీన పడ్డాయో కారణాలతో సహా అంబేద్కర్ వివరిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే “కులం బారిన పడిన భారతజాతి యొక్క డయాగ్నసిస్ రిపోర్ట్” ఈ పుస్తకం. కాబట్టి మీరు భారతీయ కులవ్యవస్థలో పుట్టి ఉంటే, ఇది మీరు కచ్చితంగా అధ్యయనం చేయాల్సిన పుస్తకం. మీరు కులాన్ని వదిలేసినా కూడా అదే సమాజంలో జీవిస్తున్నారు కాబట్టి నీ చుట్టూ ఉన్న సమాజానికి, నీకు ఉన్న రిలేషన్ని అర్దం చేసుకోవడానికైనా ఈ పుస్తకం చదవాలి. ఆలోచించాలి. చర్చించాలి.

ఎలా చదవాలి?

“నీ ఆహరపు అలవాట్లు, నీ లైఫ్ స్టైలూ సరిగా లేవు. నీ ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుపోయింది. జంక్ ఫుడ్డు మానేసి, పోషకవిలువలున్నఆహారం తిను. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండు” అని డాక్టర్ చెబితే, “నా అలవాట్లనే తప్పు పడతావా?” అని డాక్టర్ తో గొడవ పెట్టుకుంటామా? లేదు కదా? శ్రద్దగా విని, డౌట్స్ ఉంటే అడిగి, కొత్త లైఫ్ స్టైల్ మీద ఒక క్లారిటీ తెచ్చుకుంటాం. అటువంటి ఓపెన్ మైండ్ తోనే డాక్టర్ B.R. అంబేద్కర్ ఈ పుస్తకంలో లేవనెత్తిన ప్రశ్నలను, చర్చించిన అంశాలనూ, చారిత్రక కారణాలను శ్రద్దగా విని, వాటిని మన చుట్టూ ఉన్న సమాజపు కట్టుబాట్లతో, సంప్రదాయాలతో పోల్చుకొని, నిజానిజాలు అర్దం చేసుకోవాలి. అలా చేస్తే బాబా సాహెబ్ ఎంత ప్రేమతో ఈ పరిశోధనా పత్రాన్ని మన ముందు ఉంచారో అర్దం అవుతుంది. మన జీవితాలను, మన పిల్లల జీవితాలను మెరుగుపరచుకొనే అవకాశం ఉంటుంది. ఈ పుస్తకాన్ని విమర్శనాత్మక దృషితోనే చదవండి. తప్పులేదు. “నేను చాలా పరిశోధన చేసి చెబుతున్నాను కాబట్టి మీరు నమ్మితీరాలి” అనే ధోరణి బాబా సాహెబ్ రచనల్లో ఎక్కడా కనిపించదు. “నేను చెప్పిన సిద్ధాంతం తప్పని హేతుబద్దంగా నిరూపిస్తే, దానిని విడిచిపెట్టేయడానికి సిద్దంగా ఉన్నాను” అని ఈ పుస్తకంలోనే అంటారు.

ఈ పుస్తకంపై కొన్ని అపోహలు – వాటికి సమాధానాలు :

హిందూ మతానికో, ఈ దేశ సంస్కృతికో వ్యతిరేకంగా ఈ పుస్తకం రాసారనే అపోహలో కొందరున్నారు. కానీ ఇదే పుస్తకంలో “ఎన్నో జాతులు కలగలిసిన సంస్కృతి భారతదేశం సొంతమని, సాంస్కృతిక ఐకమత్యం విషయంలో భారత ఉపఖండాన్ని మించిన దేశం మరొకటి లేదు” అని అంబేద్కర్ అంటారు. అటువంటప్పుడు బాబా సాహెబ్ గురించి అటువంటి తప్పుడు అభిప్రాయం ఎలా ఏర్పడింది? దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారి రచనలు చదవకుండా పుకార్లను నమ్మడం. ఒక శుభ్రమైన తెల్లని షర్ట్ పై మురికి నీరు పడ్డప్పుడు, “ఆ మురికి నీరు చాలా ప్రమాదకరం. దానిలో రోగకారక క్రిములుంటాయి. ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఆ మురికిని వెంటనే నిర్మూలించాలి. షర్ట్ ని బాగా ఉతకాలి” అని అంబేద్కర్ గారు అంటే, “నువ్వు మా షర్ట్ ని తప్పు పడుతున్నావ్” అని కొందరు తప్పుడు అర్ధాలు తీసారు. ఆయన వ్యతిరేకించింది, నిర్మూలించాలని చెప్పింది కులవ్యవస్థ వలన ఏర్పడిన తప్పుడు ఆచారాలని, సమన్యాయం లేని విలువలని, భారతీయుల మధ్య ఐక్యత లేకుండా చేసిన సామాజిక అడ్డుగోడలని, భారతీయుల జన్యువులను బలహీన పరచిన అంతర వివాహ వ్యవస్థని, వీటన్నిటికీ మూలమైన కులవ్యవస్థ అనే విష వృక్షాన్నిమాత్రమే. ఆయన వ్యతిరేకించింది షర్ట్ కి అంటిన మురికినే గానీ, షర్ట్ ని కాదు. కాకపోతే హిందూ మతంలో కులం అనే మురికి అంతటా వ్యాపించింది ఉంది కాబట్టి ప్రక్షాళన కూడా పెద్ద మొత్తంలోనే జరగాలి. మెజారిటీ హిందువులకు కులవ్యవస్థతో సంభంధంలేని మత ఆచారాలు, జీవన విధానం ఊహాలో కూడా ఉండవు. అందుకే వారు కులాన్ని విమర్శించినా మతాన్ని విమర్శించినట్టే ఫీలవుతారు.

ఇక్కడ కులవ్యవస్థ అనేది మొదటి నుండీ లేదని, మధ్యలోనే వచ్చిందని, అంబేద్కర్ గారు చాలా పరిశీలనలతో వివరిస్తారు. వాటినుండి ఒక ఉదాహరణ చూద్దాం. సపిండాలు(blood kins) మధ్య వివాహం ఇక్కడి సంస్కృతిలో నిషేధం. సపిండాలు అంటే తల్లి వైపు మూడు తరాలు, తండ్రి వైపు ఐదు తరాలు రక్త సంభందం కలిగినవారు. అలాగే ఒకే గోత్రంలో ఉన్నవారు వివాహం చేసుకోవడం కూడా ఇక్కడ నిషేధమే. ఈవిధంగా బాహ్య వివాహాలను మాత్రమే ప్రోత్సహిస్తూ, అంతర వివాహాలను నిషేదించే సంస్కృతి ఉన్నచోట, అంతర వివాహాలు జరిగితే తప్ప బతకలేని “కులవ్యవస్థ” పుట్టే అవకాశం ఉండకూడదు. కానీ ఇక్కడ కులం పుట్టింది అంటే బాహ్య వివాహ వ్యవస్థ మీద అంతర వివాహ వ్యవస్థ ఎప్పుడో బలవంతంగా రుద్దబడింది. అలా రుద్దబడటానికి ముందు ఏదైతే ఉందో అదే ఇక్కడి మూల సంస్కృతి. అంబేద్కర్ గారు తప్పు పట్టింది మధ్యలో వచ్చిన కులవ్యవస్థనే. ఒక చోట అంబేద్కర్ ఇలా అంటారు. కులాన్ని నిర్మూలించాక స్వాతంత్ర్యం, సమానత్వం, సోదర భావం లాంటి ఉన్నతమైన విలువలను హిందూ మతంలో ఉండేలా చూసుకోవాలి. అలాగని వాటి కోసం విదేశాలకు పోవాల్సిన పనిలేదు. అవన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నాయి అంటారు.

మనువే కులవ్యవస్థను సృష్టించి, కులనియమాలను తయారుచేసాడనే ప్రతిపాదన డా B.R. అంబేద్కర్ చేసారనే తప్పుడు అభిప్రాయంలో చాలామంది ఉంటారు. మనువుకి ముందే కులం, కులనియమాలు ఉన్నాయని, వాటిని ఒక స్థిరమైన శాస్త్రంగా మార్చి కులాన్ని కాపాడటం మాత్రమే మనువు చేసిన పని అని బాబాసాహెబ్ ఈ పుస్తకంలో అంటారు.

ఈ పుస్తకం ఎందుకు చదవాలి?

సతీసహగమనం, బలవంతపు వితంతు పద్దతి, బాల్యవివాహం దేనికదే ప్రత్యేక దురాచారంగా చూస్తారు కొందరు. నిజానికి ఇవన్నీ కులవ్యవస్థను కాపాడటం కోసం మాత్రమే పుట్టిన దురాచారాలని అర్దం చేసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. వర్గం వేరు కులం వేరు కాదని, వర్గమే కులమయ్యిందని, భూములున్న వర్గం భూమి బయటకు పోకూడదని, శాస్త్రజ్ఞానం ఉన్న వర్గం ఆ జ్ఞానం బయటకు పోకూడదని, తనచుట్టూ గోడ కట్టుకొని కులంగా మారిందని అర్దం చేసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి.

వృత్తే కులంగా రూపాంతరం చెందింది అనే వాదనలో ఎంత మోసం ఉందో చూపించి, అన్ని దేశాలలో వృత్తి ఉంది, పని విభజన(division of labour)ఉంది గానీ అక్కడ లేని కులం ఇక్కడ మాత్రమే ఎందుకుంది? అనే ప్రశ్నతో నిన్ను హేతుబద్దమైన ఆలోచనవైపు నడిపిస్తుంది కాబట్టి ఈ పుస్తకం చదవాలి.

ప్రాసలతో, పాండిత్యంతో, పదాల గారడీతో గుక్క తిప్పుకోకుండా మాట్లాడేవారు గొప్పవారని, తెలివైనవారని నమ్మి, వాళ్ళను అనుకరించడం వల్ల, మొదట్లో ఒకే వర్గంలో ఉండిన కుల జాడ్యం మిగిలిన సమాజం మొత్తం ఎలా వ్యాపించిందో అర్దం చేసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. కులం సమస్య దళితులది మాత్రమే కాదని అర్దం చేసుకోవడానికి, తండ్రి పౌరోహిత్యం చేసాడు కాబట్టి ఆ పని నచ్చకున్నా కొడుకూ పౌరోహిత్యమే చేయాల్సి రావడం, తండ్రి వ్యవసాయం చేస్తే కొడుకూ వ్యవసాయమే చేయాల్సి రావడం, తండ్రి సైన్యంలో పనిచేస్తే కొడుకూ సైన్యంలోనే చేయాల్సి రావడం, తండ్రి వ్యాపారం చేస్తే, కొడుకూ అదే చేయాల్సి రావడం వలన, నచ్చని పనిని బలవంతంగా, యాంత్రికంగా, మొక్కుబడిగా చేయడం వలన, చేసే పనిలో నాణ్యత తగ్గి, ఉత్పత్తి తగ్గి, దేశ ఆర్ధికాభివృద్ది ఎలా నాశనం అయిందో అర్దం చేసుకోవడానికి చదవాలి.

ఒక సమాజాన్ని మంచి సమాజం అనాలంటే కచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు స్వేచ్చ, సమానత్వం, సోదరభావం. కానీ కులం ఉన్నంతకాలం ఈ మూడూ సాధ్యం కావని గ్రహించి , కులాన్ని నిర్మూలించడం ఒకటే, సమాజాన్ని ఉద్దరించుకొనే మార్గమని అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి. ఇక్కడ ఎవరినైనా అభిమానించాలన్నా కులం చూస్తారు, లీడర్ని ఎన్నుకోవాలన్నా కులం చూస్తారు. దానం చేయాలి అన్నా కులం చూస్తారు. చివరికి చనిపోయిన తోటి మనిషి చివరి కార్యక్రమానికి వెళ్ళాలన్నా కులం చూసే దౌర్భాగ్యమైన మనస్తత్వం ఏర్పడటానికి కారణం కులవ్యవస్థే అని అర్దం చేసుకోవడానికి చదవాలి.

కత్తి పట్టుకొని భయపెట్టి మహమ్మదీయులు మత మార్పిడులు చేసారని, కష్టాల్లో ఉన్నవారికి ఆశ చూపి క్రైస్తవులు కన్వర్షన్ చేసారని విమర్శిస్తారు గానీ హిందువులు సొంత మతంలోని మనుషులు శాస్త్రంలో ఉన్నది చదువుకుంటానంటే నాలుక కోస్తాం, చెవుల్లో సీసం పోస్తాం అన్నారు. ఇటువంటి అమానవీయతను పెంచిపోషించిన కులం హిందూ మతానికి సూసైడ్ పిల్ లాంటిదని అర్దం చేసుకోకడానికి ఈ పుస్తకం చదవాలి.

బాబా సాహెబ్ కొన్ని సూటి ప్రశ్నలు వేస్తారు. కులం తీసేసి వ్యక్తుల గుణాల ఆధారంగా వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వాదించేవారు భర్త శూద్రుడు అయితే భార్య బ్రాహ్మణ వర్ణంలో ఉండొచ్చా? అలా కుదరదు భర్త ఏ వర్ణం అయితే భార్య కూడా అదే వర్ణంలో ఉండాలంటే స్త్రీలకు సొంత నిర్ణయం తీసుకొనే స్వేచ్చ ఉండదా? అని ప్రశ్నిస్తారు. ఒక సమూహం మొత్తం ఒక వ్యక్తి కంట్రోల్ లో ఉంటే అది బానిసత్వం అయినప్పుడు, ఒక సమూహం మొత్తం ఇంకో సమూహం కంట్రోల్ లో ఉండటం కూడా బానిసత్వమే కదా? అంటే కులవ్యవస్థను సమర్ధించేవారంతా బానిసత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా? కులం పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలనేది నిజమే గానీ నిరంతరం కులం అనే సామాజిక అడ్డుగోడలపై చిన్న బీట కూడా పడకుండా భద్రంగా కాపాడే మత ఆచారాలను ప్రక్షాళన చేయకుండా కులాన్ని నిర్మూలించడం ఎలా సాధ్యం? అని ప్రశ్నిస్తారు.

“పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప” అనే కారల్ మార్క్స్ నినాదంతో కార్మికుల్ని ఐక్యం చేసినట్టు, కుల నిర్మూలనా పోరాటానికి ప్రజలను ఐక్యం చేయడం వీలు కాదు. ఎందుకంటే కుల నిర్మూలనతో పోయేది, తనకంటే పైనున్న కులం చూపే వివక్ష మాత్రమే కాదు, తాను కింద కులంతో పోల్చుకొని ఫీలయ్యే ఆధిక్యత భావం కూడా. అందుకే స్లోగన్స్ తో పనవ్వదు. కులం అనే క్లిష్టమైన సమస్యపై సమగ్ర అవగాహన, శాస్త్రీయ అవగాహన, హేతుబద్దమైన అవగాహన కల్పించడం ఒక్కటే సరైన మార్గం. ఆ మార్గంలో నడిపించగల శక్తి ఉన్న పుస్తకం ఈ కులం(పుట్టుక – నిర్మూలన).

బాబాసాహెబ్ ఇంగ్లీష్ లో రాసిన పుస్తకంలోని భావం నుండి ఏమాత్రం పక్కకు పోకుండా, హైస్కూల్ పిల్లలు కూడా ఈజీగా చదివేలా సరళమైన తెలుగులోకి అనువదించిన Mohan Talari కి చాలా చాలా థాంక్స్. ఇటువంటి క్లిష్టమైన అంశాన్ని తీసుకొని మేధావులకు అర్ధమయ్యేలా రాయడం చాలా సులువు. కానీ మెజారిటీ జనాలకు చేరువయ్యేలా రాయాలంటే అనువదించే పుస్తకాన్ని చాలా ప్రేమించాలి. అటువంటి ప్రేమ ఈ అనువాదంలో కనిపించింది. వీలైనంత ఎక్కువమంది చేతుల్లోకి వెళ్ళి, మనిషిని మనిషిగా ప్రేమించే మార్గం వైపు నడిపించే శక్తి ఉన్న ఈ పుస్తకాన్ని మీరంతా చదివి, చర్చిస్తారని ఆశిస్తున్నాను.

పుస్తకం కోసం Seshu Korlapati వాట్సప్ నంబర్ 7989546568 ని కాంటాక్ట్ చేయండి.

Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart

dolantogel

dolantogel

dolantogel

dolantogel

dolantogel

dolantogel

dolantogel

opaltogel

opaltogel

opaltogel

opaltogel

opaltogel

opaltogel

opaltogel

opaltogel

gokutogel

gokutogel

gokutogel

gokutogel

gokutogel

gokutogel

cairbos

cairbos

cairbos

cairbos

cairbos

cairbos

cairbos

skwslot

skwslot

skwslot

skwslot

skwslot

skwslot

setiawd

setiawd

setiawd

setiawd

setiawd

setiawd

setiawd