Embark on a fascinating historical journey through ‘Kambagiri nunchi Seshagiri daakaa – O Chaaritraka Prayaanam’, a compelling Telugu literary work by author Adavala Seshagiri Rayudu. This paperback first edition weaves an intriguing narrative that bridges historical landmarks, offering readers a unique perspective on cultural heritage. Written in Telugu, this work of fiction promises to captivate history enthusiasts and literature lovers alike. The book’s thoughtful exploration of historical connections makes it a valuable addition to Telugu literature. this compact volume is perfect for both casual reading and serious study. Published in 2025, it represents a significant contribution to contemporary Telugu literary discourse, making complex historical narratives accessible to modern readers. The author’s meticulous research and storytelling prowess shine through in this carefully crafted historical exploration
Best Selling, Essays
Kambagiri nunchi Seshagiri daakaa
₹200.00
+ ₹50 For ShippingAuthor -Adavala Seshagiri Rayudu [acf field=”author”]
Pages – 174 [acf field=”pages”]





Adavala Seshagiri Rayudu –
ఆయన ఐదక్షరాల పేరులో తొలి రెండక్షరాలూ సింధూ నాగరికతలోని పశుపతి నాథుడు లేదా ఆది పురుషునికి సంకేత నామమైతే.
మలి మూడక్షరాలూ ఈ దేశానికి వలసలొచ్చి సింధు నుండి గంగా యమునలదాకా విస్తరించిన ఆర్యుల ప్రధాన సంపదకు నిదర్శనం.
ఉపాధ్యాయ వృత్తి నుండి ఆసక్తితో చరిత్ర, ఆర్కియాలజీ వైపు నడిచి శాసనాల పరిష్కర్తగా, పురాతన విగ్రహాల శైలుల గుట్టుమట్టుల ఆవిష్కర్తగా, అనేక చారిత్రక ప్రదేశాల సందర్శకుడిగా, పరిశోధకుడిగా, గ్రంధకర్తగా, కొత్త తెలంగాణా చరిత్ర బృందం కన్వీనర్‌గా…
విజయకుమార్ జాదవ్ సార్ మీద గౌరవంతో అశేరా మీద అభిమానంతో “#కంబగిరి_నుంచి_శేషగిరి_దాకా” -ఓ చారిత్రక ప్రయాణం- పుస్తకానికి విలువ పెరిగేలా ముందు మాట రాసిన Sriramoju Haragopal వారికి మనస్కరిస్తూ…
మీరూ ఆయన అభిప్రాయాన్ని చదవండోసారి…
అశేషానుభవ సంపన్న చరిత్ర రాయసం అశేరా
ఒక వ్యక్తితో పరిచయం స్నేహంగా కొనసాగి, ఆత్మీయతతో అల్లుకుని, ఆ వ్యక్తి ప్రభావవంతమైన ప్రతిభ తనను గైడ్ చేసినందువల్ల, తనకా బాట సుగమం అయిందని, బాటలో కలిసిన ప్రతి అనుభవ స్మృతిని, మనసులో నింపుకుని ఇట్లా కలంలో ఒంపుకుంటున్న మైత్రేయుడు అశేరా.
“Ideas shape the course of history.” అని జాన్ మేనార్డ్ కీన్స్ మాట.
చరిత్ర, చరిత్రలో పురాచరిత్ర, గుడులు, గోపురాలు, శిల్పాలు, వాటి కొరకు వెతుకులాట, దూరభారాల పయనాలు, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు, చిన్న, చిన్న వస్తు సంపదల పట్ల కొత్త ప్రేమలు, అద్భుతమేదో సాధించిన మానసికానందాలు… ఈ చారిత్రకాన్వేషకులకు సహజం.
ఒకసారి ఆర్కియాలజిస్టుతో సహవాసం, సాహచర్యం సాహసాలతో కూడుకొన్నదే. ఏదన్నా కనుగొన్నారా (కనుగొనడం అంటే కంటితో కనడమే, డిస్కవరీ అంటే Dis+Cover అంటే కప్పి వున్న దానిని తొలగించి చూడడమే) అంతే… ఇక దాని లోతుపాతులు తీసేదాకా ఊపిరి మరిచిపోయి పనిచేస్తుంటారు కొందరు నిబద్ధులైన పురావేత్తలు. అశేరా దృష్టిలోపడ్డ వృత్తి ఆర్కియాలజిస్టు అనంతపురం కల్లూరు సుబ్బారావు స్మారక ఆర్కియాలజీ మ్యూజియం అండ్ పురావస్తుశాఖలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ గౌరవనీయులు విజయకుమార్ జాదవ్ సార్. తనను 1996 మార్చిలోనో, ఏప్రిల్లోనో కలిసాడు అశేరా అనబడు అడవాల శేషగిరి రాయుడు.
తనకు విజయకుమార్ జాదవ్ సార్‌తో పరిచయం కావడాన్ని బౌద్ధారామం చేరిన అనామకుడు తన ఆకలిని కనిపెట్టి, కడుపునిండా తిండి పెట్టించిన తథాగతుడు అగుపించినట్లుగా పోల్చిచెప్పడం అశేరా సహృదయత, జ్ఞాన దాహానికి గుర్తు. విజయకుమార్ సార్ అశేరాను తన వెంట చరిత్ర అన్వేషణా మార్గాల్లో తిప్పి, చారిత్రక విషయాలను గ్రహింపుకు తెచ్చుకోవడానికి చూపిన గైడెన్స్ తనను చరిత్ర పిపాసిగా మార్చింది. చరిత్రకు కులం లేదు, మతం లేదు, వివక్షలేదు. తెలుసుకోవడం అన్నదొకటే సూత్రం. చరిత్రకారుడు కుల, మత, ప్రాంత, జాతి వగైరా వివక్షలు, విభేదాలు లేకుండా వున్నపుడే ఏ ప్రీ ఆక్యుఫైడ్ నోషన్స్ లేకుండా చారిత్రక అవగాహన ఏర్పడుతుందని నేను నమ్ముతాను.
అశేరా సంగీత విద్వాంసుడు. సంగీత పాఠాలు చెప్పే టీచర్. కథారచయిత, వ్యాసాల వ్యాసుడు, సామాజిక విశ్లేషకుడు. ఇవన్నీ వుండగా ఈ చరిత్ర వాసనలు ఎందుకు నచ్చాయో మరి. సూది కొరకు అడుగబోయి సోదిలో పడిపోయినట్లు తనకు కూడా నా లెక్కనె చరిత్ర జబ్బు పట్టుకుంది. విజయకుమార్ జాదవ్ గారు ఆ అగ్నికి ఆజ్యం పోసారు.
గురు, శిష్యులిద్దరు ఇంటాక్ సంస్థలో బాధ్యులుగా పనిచేసారు. బెలూం గుహల అన్వేషణ, నిర్వహణలో భాగస్వాములు కావడం చారిత్రాత్మకం. బెలూం గుహలతో ముడివడ్డ ఒక దొంగ సన్యాసి కథ సినిమాల్లో విలన్ వంటి కథే కానీ నిజంగా జరిగింది. ఇటువంటి ప్రమాదాలుంటాయి జాగ్రత్త అనే హెచ్చరిక ఈ కథ చెప్తుంది. కదిరి కథ మరొక సంచలనమే. తిమ్మమ్మ మర్రిమాను కథకు యూట్యూబర్ సొంత కవిత్వాలెక్కువై, చరిత్రను పొడిచేసారు. సతిశిలల గురించి తెలియనివారు సతీసహగమనాల గురించి చెప్పేవి తప్పుడు కథలు. ఒక గొప్ప దేశాభిమాని బ్రిటిష్ వాండ్లు పుట్టించిన పుకారు అన్నాడు. వేదకాలం నుంచి ఒక అరాచక ఆచారమది. రాచరిక వీరులు, శైవ భక్తుల సతులు ఆత్మార్పణం చేసుకున్నారన్న వాస్తవాలు అంగీకరించక కొత్తగా ఏవో కల్పిస్తుంటారు. తెలుగునాట వందలాది సతిశిలలు కర్ణాటకలో మాస్తికల్లులు సహగమనానికి సాక్ష్యాలు కావా?
అశేరా విజయకుమార్ సార్‌తో కలిసి చేసిన చరిత్ర యాత్రలు, ఆ అనుభవాల గురించి తనకున్న చారిత్రక, సాంస్కృతిక అవగాహనతో ఈ కథనం గొప్ప నేరేషన్ శైలి. మూస పోసినట్టుండే యాత్రా కథనాలకు భిన్నంగా తన రచన వైవిధ్యభరితమైనది. విజయకుమార్ సార్ పురావస్తు అధికారిగా పనిచేసిన తీరుతెన్నుల్ని సహచరుడిగా అశేరా ఎంత సునిశితంగా గమనించాడో, అంత సవివరంగా కథనాత్మకంగా రచించాడీ పుస్తకాన్ని.
విజయకుమార్ జాదవ్ సార్‌తో నాకు నాలుగైదేండ్లుగా పరిచయం సోషల్ మీడియా ద్వారానే. గంటల కొద్ది మొబైల్లో సంభాషణలు. అన్నీ శాసనాల గురించో, శిల్పాల ప్రతిమా లక్షణాల గురించో, ఇతర చరిత్రకారులు చేసిన రచనలు, కొత్త పరిశీలనల గురించి వారు రాసిన వ్యాసాల మీద చర్చో మా టాపిక్స్. నా సందేహాలను అడిగి తెలుసుకుంటుంటాను. అట్లే వారు అంత నేర్చిన వారైనా నన్ను ఇదేమిటనవచ్చు, అదేమిటని చెప్పవచ్చునని అడుగడం నాకు విస్మయకరంగా వుంటుంది. హైద్రాబాద్ పక్కన ఉండే కీసరలో దొరికిన 5వ శతాబ్దపు “తొలుచువాన్డ్రు” తొలి తెలుగు శాసనమని నేను చర్చ లేవనెత్తినని, అది వాస్తవమని, తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా తెలిపారు. త్రిపురాంతకంలోని స్త్రీ వీరగల్లును నేను అది కీల్గుంటెగా గుర్తించినపుడు, గణపతి, విశ్వేశ్వరదేవుల సంభాషణా శిల్పాన్ని గురించి రాసినపుడు విజయకుమార్ సార్ వాటి సమంజసతను గూర్చి తనదైన అభిప్రాయాన్ని పాజిటివ్ గా చెప్పారు.
అది వారి సహృదయ చరిత్రకారుని స్వభావం. తను ఫణిగిరిలో పని చేసినపుడు పురావస్తు తవ్వకాల గురించి వివరించారు. ఇక్ష్వాకుల శాసనాలను చదివి వినిపించారు. తాను గుర్తించిన ప్రత్యేక శిల్పం సత్యాకృష్ణ లేదా సత్యావేణుగోపాలుని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్వస్తికాసనంలో నిల్చుని వేణువాద్యం చేస్తున్న గోపాలుడు ఆరు చేతులవాడు, విల్లమ్ములు, వేణువు, పుష్పం ధరించి వున్న అర్ధనారీ గోపాలుడు. ఇటువంటి శిల్పమెక్కడా లేదు. అర్థనారీశ్వరునివలె అర్ధనారి గోపాలుణ్ణి ఊహించిందెవరో, శిల్పం చేసిందెవరో కాని, అది అపూర్వం. దానిని గుర్తించింది విజయకుమార్ జాదవ్ గారు. కొలనుపాకలో సోమేశ్వరాలయం ముందరి మ్యూజియం ప్రాంగణంలోని ఒక హనుమంతుని శిల్పాన్ని కాదు, హనుమంతుని కొడుకు మత్స్యవల్లభుడని చెప్పింది సారే. అశేరా విజయకుమార్ సార్ ప్రతిభకు గుర్తులుగా వీటిని ప్రస్తావించారు.
దేవాలయాలలో దేవుళ్ళను ప్రతిష్టించివారు గతించారు. ఇపుడు వాటిని ఆక్రమించుకొన్నవారు, తమ(ఇష్టాలకు)కనుకూలంగా మార్చుకున్నవారు గుడిలో దేవుండ్ల పేర్లు మార్చేసారు. వాటిని స్థలపురాణాలను ఎక్కడెక్కడివో చెప్పుకొస్తారు. కానీ వారిననేదేమిలేదు, వారికి విగ్రహాల ప్రతిమా లక్షణాలు తెలియనపుడు విబుధ జనుల నోట విన్నంత, కన్నంత తాము తోచినంత నామకరణాలు చేస్తుంటారు.
బాసరలో జైన సరస్వతిని పార్వతిగా పూజిస్తున్నారు. కొలనుపాక దగ్గరలో కాశీవిశ్వేశ్వరుని గుడిలో అన్నపూర్ణ అనుకున్న దేవత బౌద్ధ హారీతిగా గుర్తించినట్లు పత్రికలో రాగానే విగ్రహాన్ని ప్రస్తుతం మార్చారు. లింగాలకు బ్రహ్మసూత్రాలుంటే గొప్ప అని చెప్పే ప్రవచనకారులకు, పూజారులకు అవి రూపంలేని లింగాలకు ముఖస్థానం తెలిపే లక్షణోద్ధారరేఖలని తెలియదు. మత్స్య, అగ్నిపురాణాలలో ప్రతిష్టా విధులలో వివరించి వుంది. అవి కొత్తవో ఎంత పురాతనమైనవో తెలుసుకోవడానికి ఆ శిల్పాల శైలి ఆధారం. అది చరిత్రకారుల పరిశీలనాదృష్టి, ప్రతిమా లక్షణ శాస్త్రావగాహన మీదనే ఆధారపడివుంటుంది. విజయకుమార్ సార్ వెంట వుండి ఇటువంటి అనుభవాలను ప్రోగుచేస్తున్నాడశేరా.
అనంతపురం మ్యూజియం అధికారి(ణి) ఏడి రజతగారి కోరిక మేరకు తనకున్న అనంతపురం మ్యూజియానుబంధం, విజయకుమార్ సార్ సాహచర్యం గురించి పంచుకుంటున్న ఔత్సాహిక చారిత్రక పరిశోధక ప్రేమికునని చెప్పుకున్నాడు అశేరా.
తన అనుభవాలను గురించి చదువుతుంటే గత పాతికేండ్లుగా నాక్కలిగిన అనుభవానుభూతులన్ని గుర్తొచ్చాయి. చరిత్ర సమస్త శాస్త్రాల సంకలనం. సముద్రమంతది. ఏ కొద్దిగానో తెలిసి, నేను చరిత్రకారుణ్ణి, ఇది నా ఎకౌంట్లోని చరిత్రను ఎవరు తాకకూడదు అనుకునే వారి నడుమ ఎంత తెలిసినా, ఒదిగివుండే సౌమ్యులు, నిజాయితీకలవారు…వ్యక్తిగతంగా కలిసి అశేరా లెక్క వుండనివాన్నే కానీ, నాకు విజయకుమార్ సార్ అంటే గౌరవం, అభిమానం. అందుకే అశేరా అంటే ఇష్టం. ఈ ఒక్కదానికే కాదు. తనకున్న ఇతర ప్రతిభా విశేషాల వల్ల కూడా ఇష్టమే తాను. అయినా మాది ఫేస్కుక్కులు, మొబైల్ దోస్తానమే.
నేనిట్లనే రాసుకుంటా పోతే తాను రాసిన 100 పేజీల పుస్తకానికి మరో పుస్తకం రాయడం భావ్యం కాదు. అశేరా బాగా రాయగల రచయిత. నిర్బంధాలను ఒప్పుకోని గొప్ప గుణం మనిషి. తాను పెద్ద పుస్తకమే రాయాలని, అంత దూరం నుంచి నన్ను తన పుస్తకాని మాట రాయమని ఇంత గౌరవమిచ్చిన అశేరా డొక్కలో తలబెట్టి, శుభాకాంక్షలన్నా…
“I like the dreams of the future better than the history of the past.” అంటాడు థామస్ జెఫర్సన్… నేను కూడా అంతేననుకుంట.
శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైద్రాబాద్