స్త్రీ వాదం ఎందుకో ఏకపక్షంగా మారిపోతోంది. ఒకోసారి హక్కుల పోరాటంలో బాధ్యతలను వెనక్కు నెడుతున్నాం అనిపిస్తుంది. అలాగే చాలా చర్చలు ఏకపక్షంగా సాగుతుండడం కూడా నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. నా చూట్టూ నేను పరిశీలిస్తున్న జీవితాలు, నేను చూసిన మనుషులలో ఎన్నో భిన్న దృవాలున్నాయి. విక్టిమైజ్డ్ అయిన స్త్రీలు ఉన్నారు. పోరాడుతున్నవారూ ఉన్నారు. స్వేచ్ఛ లభించని వాళ్ళు ఉన్నారు. స్వేచ్చ అర్ధం తెలియక మసలుతున్న స్త్రీలూ ఉన్నారు.
ఈ సంకలనంలో నేను చెప్పిన పదిహేను కథలు నిజ జీవిత గాధలు. అందులో ప్రధాన పాత్రలు నా జీవితంలో నేను చూసిన వాళ్ళే. కథలన్నీ వాస్తవ గాధలే. ఆ పాత్రలతో నేను జరిపిన సంభాషణలనే యధాతధంగా చెప్పే ప్రయత్నం చేసాను. వారి నేపధ్యాలను, కథ కోసం కథనం కోసం మార్చాను. ఈ కథలలో నేను ఏ పక్షమూ తీసుకునే ప్రయత్నం చేయలేదు. జరిగిన వాటిని యధాతధంగా మీ ముందుంచాను. తప్పు ఒప్పులు, మంచి చెడులు నేను చెప్పదల్చుకోలేదు. ఆ పాత్రల గొంతుకను వినిపించానంతే. వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే జీవించారు. దాన్నే నేను చెప్పాను.
- జ్యోతి






Reviews
There are no reviews yet.